![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -508 లో..... భాగ్యం, సుకన్య ప్లాన్ లో భాగంగా సుకన్య ఆటోతో వెళ్తుంది. ఇక నర్మద, వల్లి వస్తున్న స్కూటీని ఆటోతో వెళ్ళి ఆక్సిడెంట్ చేస్తుంది. దాంతో హాస్పిటల్ కీ తీసుకొని వెళ్తారు. అక్కడ సుకన్య పెట్టిన డాక్టర్ మెరుపుతీగ వాళ్ళు చెప్పినట్టు యాక్టింగ్ చేస్తుంది. వేదవతి వాళ్ళకి వల్లికి అబార్షన్ అయిందని చెప్తుంది. దాంతో వేదవతి షాక్ అవుతుంది. ఏంటి మీరు అనేది అంత చిన్న ఆక్సిడెంట్ కి అబార్షన్ అవుతుందా రిపోర్ట్స్ ఎక్కడ అని నర్మద అడుగుతుంది.
దాంతో వేదవతి తనపై కోప్పడుతుంది. బలవంతంగా తనని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళావని అంటుంది. తనకంటే ముందు నా కూతురు తల్లి అవుతుందని తనకి ఈర్ష్య అని భాగ్యం అంటుంది. అమ్మ నువ్వు అలా అనకే పాపం నర్మద చెల్లి చాలా మంచిది అని వల్లి యాక్టింగ్ చేస్తుంది. బావ మన బిడ్డ లేదని వల్లి యాక్టింగ్ చేస్తుంది. చందు బాధపడుతాడు. అప్పుడే తిరుపతి, రామరాజు హాస్పిటల్ కి వస్తారు. వల్లికి అబార్షన్ అయిందని తెలిసి బాధపడతాడుమ అసలు ఏం జరిగిందని రామరాజు అడుగుతాడు. నాకు కడుపునొప్పిగా ఉంటే నేనే హాస్పిటల్ కి వెళదామని అన్నాను. దాంతో నర్మద హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంటే చిన్న ఆక్సిడెంట్ అయిందని వల్లి చెప్తుంది. దాంతో నర్మద షాక్ అవుతుంది.
ఆ తర్వాత చందుకి రామరాజు దైర్యం చెప్తాడు. ఏంటే నర్మద పేరు చెప్పకుండా అలా కవర్ చేసావని వల్లితో భాగ్యం అంటుంది. ఏం లేదే ఇప్పుడు తన పేరు చెప్తే పగతో నా కడుపుగుట్టు బయటపెట్టడానికి ట్రై చేస్తుంది. అలా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నా గురించి మంచిగా అనుకుంటుందని భాగ్యం వాళ్ళతో వల్లి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |